మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా నుంచి సరికొత్త అప్డేట్?

హీరో అఖిల్, హీరోయిన్ పూజా హెగ్డే కలిసి లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. అలాగే భలే బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు అలాగే వాసు వర్మ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.అయితే తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నుంచి లెహరాయి లిరికల్ సాంగ్ అప్డేట్ వచ్చింది.

ఈ సాంగ్ సెప్టెంబర్ 15న విడుదల కానుంది. ఈ మేరకు అఖిల్, పూజా హెగ్డే రొమాంటిక్ పోస్టర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది. అయితే ఈ సినిమా అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు చిత్రం యూనిట్.ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి పోస్టర్ వైరల్ అవుతోంది.