అదరగొడుతున్న మహాసముద్రం ట్రైలర్..!

హీరో సిద్ధార్థ్,హీరో శర్వానంద్,కలిసి ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి తో కలిసి నిర్మిస్తున్న చిత్రం మహా సముద్రం. ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ తో రూపొందుతున్న చిత్రం. ఈ సినిమాలో హీరోయిన్ గా అదితి రావు హైదరి, అనుఇమ్మానుయేల్ కథానాయకులుగా నటిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి కొద్ది నిమిషాల ముందు ఒక ట్రైలర్ విడుదల కాగా, ఆ ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

డైరెక్టర్ అజయ్ భూపతి ఆర్ఎక్స్100 లాంటి రొమాంటిక్ చిత్రంతో హిట్ కొట్టిన..ఇప్పుడు మహా సముద్రం సినిమాలో అంతా మాస్ యాంగిల్ , రొమాంటిక్ యాంగిల్ లోనే సినిమాని తెరకెక్కించబోతున్నాడని చెప్పవచ్చు. ఇక ఈ ట్రైలర్ లో శర్వానంద్ సిద్ధార్థ్ డైలాగులతో అదరగొట్టారని చెప్పవచ్చు.ఇందులో గూని బాబ్జిగా రావు రమేష్ తన స్టైల్ లో అలరించాడు.ఇందులో జగపతి బాబు క్యారెక్టర్లు కూడా హైలెట్ గా నిలవనున్నాయి.

“సముద్రం చాలా గొప్పది మవా . అన్ని రహస్యాలు తనలోనే దాచుకుంటుంది”.. ఇక్కడ మనం బతకాలంటే మన జాతకాన్ని దేవుడు మందు కొట్టి రాసి ఉండాలి”.. అనే డైలాగ్ బాగా ఆకట్టుకుంటోంది ప్రేక్షకులను. ఈ సినిమా అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.  https://youtu.be/khbpC9joyoY

Share post:

Popular