400 కోట్ల ఆఫర్ ను తిరస్కరించిన బాలీవుడ్ నిర్మాత.. ఎవరో తెలుసా?

కరోనా మహమ్మారి కారణంగా థియేటర్ లలో విడుదల అవ్వాల్సిన చిత్రాలన్ని కూడా ఓటీటీ బాట పడుతున్నాయి. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకోకపోవడంతో,ఓటీటీలు భారీ ఆఫర్లతో దర్శక,నిర్మాతలను ఆకట్టుకుంటున్నాయి.ఈ క్రమంలో బాలీవుడ్‌ పెద్ద హీరోలు సల్మాన్‌ ఖాన్‌ రాధే, అజయ్‌ దేవగన్‌ భూజ్‌,ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా వంటి భారీ బడ్జేట్‌ చిత్రాలు సైతం ఓటీటీలోనే విడుదలయ్యాయి.

అయితే ఇది నిర్మాతలకు లాభాలు బాట పట్టించినప్పటికీ.. .థియేట‌ర్ల‌ను న‌మ్ముకున్న డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లకు మాత్రం తీవ్ర న‌ష్టాన్ని మిగిల్చే విష‌య‌ం. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు మద్దతుగా బాలీవుడ్‌ అగ్ర నిర్మాత అదిత్య చొప్రా నిలుస్తున్నారు. ఆయనకు ఓటీటీలు నుంచి కళ్లు చెదిరే ఆఫర్లు వచ్చినప్పటికి సున్నితంగా వాటిని తిరస్కరిస్తున్నారట. య‌శ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థలో ఆయన నిర్మించిన బంటీ ఔర్ బ‌బ్లీ 2, పృథ్విరాజ్‌, ‘జ‌యేశ్ భాయ్ జోర్దార్’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్ననేప‌థ్యంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత‌ ఆదిత్యాచోప్రాకు ప‌లు ఓటీటీ ప్లాట్ ఫామ్ ల నుంచి భారీ ఢీల్‌కు ఆఫ‌ర్లు వ‌చ్చాయ‌ట‌.

కానీ ఆదిత్యా చోప్రా మాత్రం ఓటీటీ ఆఫ‌ర్ల‌ను తిర‌స్క‌రించిన‌ట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే ఈ నాలుగు చిత్రాల‌కు ఏకంగా రూ .400 కోట్లు ఆఫ‌ర్ చేసినట్లు బీ-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఆదిత్య‌ చోప్రా మాత్రం మ‌హారాష్ట్ర‌లో థియేట‌ర్లు తెరుచుకున్న త‌ర్వాతే ఈ నాలుగు చిత్రాలను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట.

Share post:

Latest