ర‌ష్మిక వాట్సాప్ వాల్‌పేపర్‌లో ఎవ‌రి ఫొటో ఉంటుందో తెలుసా?

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. అతి త‌క్కువ స‌మ‌యంలో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుని టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది.

RASHMIKA. MANDANNA. FC (@RashimikaA) | Twitter

ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ సినిమాలు చేస్తోంది. దాంతో క్ష‌ణం తీరిక లేకుండా వరుస షూటింగ్ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. అయితే ఇప్పుడు ఈ భామ శర్వానంద్ హీరోగా వస్తోన్న `ఆడవాళ్లు మీకు జోహార్లు` అనే సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది. అయితే షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా.. సోష‌ల్ మీడియాలో మాత్రం ర‌ష్మిక య‌మా యాక్టివ్‌గా ఉంటూ త‌న అభిమానుల‌తో ఏదో ఒక‌టి షేర్ చేసుకుంటుంది.

rashmika Mandanna

తాజాగా రష్మిక తన వాట్సాప్ చాట్‌ను బయటపెట్టేసింది. ఇందులో వాట్సప్ వాల్ పేపర్ బయటకు వచ్చేసింది. ఇంత‌కీ ర‌ష్మిక వాట్సాప్ వాల్‌పేపర్‌లో ఎవ‌రి ఫొటో ఉందో తెలుసా.. ఆమె ఎంతో ముద్దుగా, ప్రేమ‌గా పెంచుకునే పెట్ డాగ్ ఫొటోను పెట్టుకుంది. ఇక ర‌ష్మిక పంచుకున్న వాట్సాప్ చాట్ విష‌యానికి వ‌స్తే.. అది ఆమెకు, వాళ్ల అమ్మ‌కు మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌. అదేంటో మీరూ పైన ఫొటోలో చూసేయండి.

Share post:

Popular