కాస్టింగ్ కౌచ్ పై సంచలన వాఖ్యలు చేసిన ఇంద్రజ?

సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పేరు కాస్టింగ్ కౌచ్.ఈ కాస్టింగ్ కౌచ్ విషయంలో ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు నోరు విప్పారు. వారి జీవితంలో ఎదుర్కొన్న విషయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకప్పటి నటి ఇంద్రజ ఈ కాస్టింగ్ కౌచ్ విషయంలో స్పందించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ప్రతి ఒక రంగంలోనే ఉంది అని తెలిపింది.అయితే ఆడ పిల్లలు ఇంటి నుంచి అడుగు బయట పెట్టేటప్పుడు వారు ఎక్కడికి వెళ్తున్నారు అన్న విషయంపై శ్రద్ధ వహించాలి, అలాగే వారికి సమస్యలు ఎదురైతే వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలని స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్లాలి కానీ అవకాశాల కోసం మన వ్యక్తిత్వాన్ని చంపుకోకూడదని తెలిపింది.

- Advertisement -

అలాగే మనం తీసుకున్న నిర్ణయాలు మొదట కఠినంగా ఉన్నప్పటికీ కొన్ని అవకాశాలు చేజారిపోయిన కూడా ఆ తర్వాత మరికొన్ని అవకాశాలు దక్కుతాయి. అంతేకానీ అవకాశాల కోసం మన వ్యక్తిత్వాన్ని చంపుకోకూడదు. అలా చేసి తర్వాత పొరపాటు చేశాను ఆ సమయంలోను నేను అలా చేయకుండా ఉంటే బాగుంటుందని బాధపడటం వృధా అంటూ ఇంద్రజ ఇంటర్వ్యూ సందర్భంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి తెలిపారు. ఇక ప్రస్తుతం ఈమె బుల్లితెరపై పల్లెటూర్లలో జడ్జిగా వ్యవహరిస్తోంది.

Share post:

Popular