వర్క్ అవుట్ తో కుర్రకారులను పిచ్చెక్కిస్తున్న సాయేషా.. వైరల్ గా మారిన వీడియో?

September 14, 2021 at 6:31 pm

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మొదటి చిత్రం అఖిల్ సినిమా తో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన సయేషా సైగల్ గురించి మనందరికీ తెలిసిందే. మొదటి సినిమా తర్వాత ఈమె మళ్లీ కనిపించలేదు. కానీ తమిళంలో మాత్రం సయేషా మహా బాగానే నడుస్తుంది అని చెప్పవచ్చు. ఈమె తమిళ హీరో ఆర్య ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. ఇక పెళ్లి అయిన తర్వాత కూడా ఏ మాత్రం తగ్గకుండా సినిమాల్లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఇది ఇలా ఉంటే తాజాగా సయేషా జిమ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో మొదలవుతుంది. ఇక ఈ వీడియో ని చూసిన ఆమె అభిమానులు, అలాగే నెటిజన్లు శభాష్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా ఈ వీడియో వైరల్ అవడంతో పాటు ట్రెండింగ్ లో కూడా వెళుతుంది. బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరో గా నటిస్తున్న అఖండ సినిమాలో సయేషా నటిస్తున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. ఈ విషయాన్ని సయేషా తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ కూడా చేసింది.

వర్క్ అవుట్ తో కుర్రకారులను పిచ్చెక్కిస్తున్న సాయేషా.. వైరల్ గా మారిన వీడియో?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts