ఆ సినిమాలో కమల్ హాసన్ మేకప్ కు అన్ని కోట్లా..?

సాధారణంగా ఏ సినిమాలో అయినా సరే కేవలం హీరోయిన్ లకు మాత్రమే భారీ బడ్జెట్ లో మేకప్ లు వేస్తూ ఉంటారు.. భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ కు ఏకంగా కోట్ల రూపాయలు వెచ్చించి మరీ మేకప్ వేసారట.. అదేంటో పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1996 ఏప్రిల్ లో ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్ కలిసి నటించిన చిత్రం భారతీయుడు. అవినీతి నేపథ్యంలో సాగిన ఈ సినిమా అన్ని భాషలలో విడుదల ఏకంగామూడు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాను రూ.12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా,దాదాపు అన్ని భాషలలో విడుదల అయి బాక్సాఫీసు వద్ద 60 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టి, డబ్బింగ్ మూవీస్ లో కూడా మంచి గుర్తింపు పొందింది.. ఇక ఇందులో కమల హాసన్ ద్విపాత్రాభినయం చేసి మెప్పించాడు. ఐశ్వర్య రాయి, శిల్పాశెట్టి ని అనుకోగా , వీరికి డేట్స్ కుదరక పోవడంతో మనిషా కొయిరాలా సెలెక్ట్ చేసుకున్నారు..

Bharateeyudu 2, Kamal Political Entry Film!?

ఇక అసలు విషయానికొస్తే, కమల్ హాసన్ కు గెటప్ వేయడానికి రోజుకు ఐదు గంటలు పట్టేదట..అలాగే తీయడానికి రెండు గంటల సమయం పట్టిందట… ఆస్ట్రేలియా నుంచి మేకప్ మ్యాన్ ను పిలిపించి, అతనికి ఏకంగా కోటి రూపాయలు ఇచ్చారట.ఇంత కష్టపడ్డారు కాబట్టే ఈ సినిమా పాన్ ఇండియా రేంజిలో మంచి విజయాన్ని అందుకుంది.