పెళ్ళిసందD ట్రైలర్ కు రెస్పాన్స్ మామూలుగా లేదుగా?

హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా తాజాగా నటించిన చిత్రం పెళ్లి సందD. కె రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను శోభు యార్లగడ్డ, మాధవి కోవెలమూడి, ప్రసాద్ దేవినేని, ఆర్కే మీడియా వర్క్ ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో హీరో రోషన్ సరసన శ్రీ లీల ప్రధాన పాత్రలో నటిస్తోంది.

శ్రీనివాసరెడ్డి,పోసాని మురళి కృష్ణ, రావు రమేష్,రాజేంద్రప్రసాద్,ప్రకాష్ రాజ్ పలువురు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించగా, సినిమాటోగ్రఫీ సునీల్ కుమార్, తమ్మి రాజు ఎడిటింగ్ చేస్తున్నారు.ఇది ఇలా ఉండే సెప్టెంబరు 22న పెళ్ళిసందD ట్రైలర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్.

ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే యూట్యూబ్ లో పెళ్లి సందD ట్రైలర్ 5 మిలియన్ ప్లస్ వ్యూస్ దాటింది. ఇక తాజాగా ట్విట్టర్ లో కొత్త పోస్టర్ను విడుదల చేసి ఈ విషయాన్ని ప్రకటించారు. సినిమా 1996లో విడుదలైన పెళ్ళి సందడి ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తుంది.

Share post:

Latest