బిగ్ బాస్ -5లోకి టాలీవుడ్ హీరోయిన్?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సీజ‌న్లు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఐదో సీజ‌న్ కూడా ప్రారంభం కానుంది. ఈ సీజ‌న్‌కు కూడా కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తెలుస్తుండ‌గా.. కంటెస్టెంట్స్ ఎంపిక గత సీజన్ మాదిరే జూమ్ యాప్‌లో ఎంపిక చేశార‌ని ప్రచారం జరుగుతుంది.

అంతేకాదు, బిగ్ బాస్ సీజ‌న్ 5లో పాల్గొనే కంటెస్టెంట్లు వీరే అంటూ ఇప్ప‌టికే బోలెడ‌న్ని క‌థ‌నాలు కూడా వెలువ‌డ్డాయి. అయితే తాజాగా మ‌రొక బ్యూటీ పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఆమె ఎవ‌రో కాదు.. జాంబి రెడ్డి ఫేమ్ లహరి శారి. మొద‌ట బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ల‌హ‌రి శారి.. ఆ త‌ర్వాత మెల్ల మెల్ల‌గా సినిమాలు చేస్తూ జాంబి రెడ్డిలో అవ‌కాశం ద‌క్కించుకుంది.

ఈ చిత్రంలో ఆమె చేసింది చిన్న పాత్రే అయిన‌ప్ప‌టికీ.. ల‌హ‌రి శారికి మంచి గుర్తింపు ద‌క్కింది. ఇక ప్ర‌స్తుతం ఈ బామ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టి సంద‌డి చేయ‌నుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారంలో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాలంటే.. మ‌రికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Popular