విజయ్ సాయి‌రెడ్డికి నోటీసులు…?

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు విజయ్‌సాయిరెడ్డికి షాక్ తగిలింది. ఎంపీ విజయ్ సాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఎంపీ విజయ్ సాయి కోర్టు షరతులను ఉల్లంఘించారంటూ రఘురామ కృష్ణం రాజు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన సీబీఐ కోర్టు విజయ్ సాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ విషయమై ఎంపీ విజయ్ సాయి ఇంకా స్పందించలేదు.

ఆయన ఎలా స్పందిస్తారో అనేది తెలియాలంటే కొంచెం సమయం వేచిచూడాలి. ఈ సంగతులు పక్కనబెడితే గత కొద్దిరోజులుగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు వైసీపీ నేతలపై టార్గెట్ చేస్తున్నారు. ఏకంగా సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేశాడు. వైసీపీలో ఉంటూనే వైసీపీ అధినేత జగన్, ఎంపీ విజయ్ సాయిరెడ్డిని టార్గెట్ చేయడాన్ని బట్టి చూస్తే రఘురామ కృష్ణం రాజు వద్ద బలమైన ఆధారాలేమైనా ఉన్నాయా? అనే చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతున్నది. అయితే, కేవలం అహం వల్లే రఘురామ కృష్ణం రాజు వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

Share post:

Popular