బిగ్‌బాస్ 5లోకి ట్రాన్స్‌జెండర్ ప్రియాంక..ఆపరేషన్ తర్వాత అదిరే ఆఫ‌ర్‌?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఐదో సీజ‌న్ త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సారి కూడా నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా.. సెప్టెంబ‌ర్ 5 నుండి స్టార్ట్ కానుంది. ఇప్ప‌టికే ఎంపిక అయిన కంటెస్టెంట్స్ క్వారంటైన్‌లోకి కూడా వెళ్లిపోయారు. మ‌రోవైపు సీజ‌న్ 5లో పాల్గొనే కంటెస్టంట్స్ వీరే అంటూ చాలా లిస్ట్‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే ఈ లిస్ట్‌ల‌లో ట్రాన్స్‌జెండర్ ప్రియాంక పేరు బ‌లంగా వినిపిస్తోంది.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న 'జబర్దస్త్' లేడీ..  ఎవరో తెలుసా..? | Jabardasth Fame Transgender Priyanka Singh Selected For  Biggboss Telugu Season 5 | TV9 Telugu

ప్రియాంక‌ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌ముఖ కామెడీ షో జబర్దస్త్‌లో సాయి తేజగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్న తరుణంలో ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారిపోయి ప్రియాంక సింగ్‌గా పేరు మార్చుకుంది. ఇక ఆప‌రేష‌న్‌తో త‌ర్వాత ఎన్నో ఇబ్బందులు ప‌డ్డ ప్రియాంక‌.. ప్ర‌స్తుతం అడ‌పా త‌డ‌పా టీవీ షోల‌తో పాటు యూట్యూబ్ ఛానెల్‌ను ర‌న్ చేస్తోంది.

Jabardasth Priyanka Singh: జబర్దస్త్ కమెడియన్ సాయి తేజ అమ్మాయిగా మారడానికి  ఎంత ఖర్చు చేసిందంటే..?

ఇలాంటి త‌రుణంలో ప్రియాంక‌కు బిగ్ బాస్ సీజ‌న్ 5 నుంచి అదిరే ఆఫ‌ర్ అందుకుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ట్రాన్స్‌జెండర్ కోటాలో ఈమె హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తుందని వార్త‌లు వ‌స్తున్నాయి. జబర్దస్త్ క్రేజ్ కూడా ఉండటంతో ప్రియాంకకు అవకాశం ఇచ్చార‌ని.. ప్ర‌స్తుతం ఆమె క్వారంటైన్‌లో ఉంద‌ని టాక్‌.

Priyanka Singh: జబర్దస్త్ బ్యూటీ క్లీవేజ్ షో.. హాట్ హాట్ పోజులతో  రెచ్చిపోయింది..