తండ్రుల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కొడుకులు వీరే?

అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది దర్శక నిర్మాతలు హీరో చిన్నప్పటి పాత్రలో నటించడం కోసం ఎవరిని కాకుండా హీరోల కొడుకులని తీసుకొని హీరో చిన్నప్పటి పాత్రలో తెరపై చూపిస్తుంటారు.అలా తండ్రుల సినిమాలలో నటించిన కొడుకులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.కృష్ణ నటించిన అల్లూరి సీతారామ రాజు చిత్రంలో చిన్నప్పటి హీరో పాత్ర కోసం కృష్ణ పెద్ద కొడుకు రమేష్ ను వెండితెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత మోహన్ బాబు హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన పుణ్యభూమి నాదేశం సినిమాలో చిన్నప్పటి మోహన్ బాబు పాత్రలో తన కొడుకు మంచు మనోజ్ నటించారు.

మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నేనొక్కడినే సినిమాలో హీరో చిన్నప్పటి పాత్ర కోసం సుకుమార్ ఏకంగా మహేష్ కొడుకు గౌతమ్ ను తెరపై చూపించారు. అలాగే విధంగా సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన మోసగాళ్లకు మోసగాడు ఈ చిత్రంలో హీరో చిన్నప్పటి పాత్ర కోసం సుధీర్ కొడుకు చరిత్ మానస్ నటించారు.రవితేజ హీరోగా రాజా ది గ్రేట్ చిత్రంలో హీరో చిన్నప్పటి పాత్ర కోసం ఎంతో మందిని సంప్రదించినప్పటికీ ఎవరు దొరకని కారణంగా దర్శకుడు రవితేజ కొడుకును ఈ సినిమాలో హీరో చిన్నప్పటి పాత్రలో చూపించారు.