టాలీవుడ్ లో శ్రీ విష్ణు ఫేవరెట్ హీరో ఆయనేనట..?

సినిమా ఇండస్ట్రీలో హీరోలకు మాత్రమే అభిమానులు ఉండటం కాదు , ఆ హీరోలకు కూడా అభిమాన హీరోలు ఉంటారనేది వాస్తవం. మన తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా కొంత మంది హీరోలకు తమ ఫేవరేట్ స్టార్ హీరోస్ కూడా ఉండడం గమనార్హం. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం హీరో గా దూసుకుపోతున్న శ్రీవిష్ణు కు కూడా ఆయన అంటే చాలా ఇష్టమట.. ఇక ఆ పూర్తి వివరాల గురించి ఒకసారి తెలుసుకుందాం..

ఇటీవల రాజ రాజ చోర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీ విష్ణుకు మన విక్టరీ వెంకటేష్ అంటే చాలా ఇష్టమట. ఇక ఆయనే తన ఫేవరేట్ స్టార్ హీరో అని కూడా ఈ సినిమా విడుదల సందర్భంగా తెలిపారు శ్రీ విష్ణు. అయితే ఈ రోజు రాజ రాజ చోర సినిమా విడుదల అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు మాటలు, సినిమా చూసిన తర్వాత లేకపోయినప్పటికీ చూసే ప్రేక్షకుడికి ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టలేదు. అమాయకుడిగా, పక్కింటి అబ్బాయిలా కనిపించే శ్రీవిష్ణు, సైలెంట్ గా వచ్చి ఈ సారి కూడా పర్వాలేదు అని అనిపించుకుంటున్నాడు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మేఘ ఆకాష్, సునైన నటిస్తుండగా దర్శకుడు హసిత్ గోలి డైరెక్ట్ చేశారు. ఇందులో రవి బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అంతేకాదు మన ఫేవరెట్ స్టార్ గంగవ్వ కూడా ఇందులో నటించడం గమనార్హం.https://twitter.com/Overseasrights/status/1428224577931550726?s=20