కేసీఆర్ ప్లాన్ ఏంటో..  ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు వాయిదా వేశారో?

హుజూరాబాద్ ఎన్నికలు జరిగేంతవరకు సీఎం, టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీర్ కాన్సట్రేషన్ మొత్తం అటే ఉంటుంది.. ఉంది కూడా. ఆయన ప్రవర్తన కూడా అలాగే ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. హుజూరాబాద్ లో ఎన్నికలు జరిగితే అక్కడ కారు దూసుకు పోవాల్సిందే అనేది గులాబీ బాస్ భావన. అందుకే ఏం మాట్లాడిన హుజూరాబాద్ గురించే మాట్లాడుతున్నాడు. అక్కడ కౌశిక్ బలమైన నాయకుడు కావడం వల్లే అతను నిరాశచెందకుండా పార్టీలోకి చేరిన వెంటనే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాడు. ఈనెల 16 నుంచి దళిత బంధు కూడా అమలు చేయాలని భావిస్తున్నారు. ఇది సరే.. మరి అసెంబ్లీ కోటాకు సంబంధించి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు వాయిదా వేశారు అనేది ఇపుడు అందరి మదిలో మెదిలో మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎమ్మెల్యే కోటాలో  ఎమ్మెల్సీలుగా ఆరుగురికి గెలిచే అవకాశముంది. ఎటూ టీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ ఉంది కాబట్టి అందరూ గులాబీ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారు. మరి ఇలాంటి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో కరోనా ఉంది.. ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్ణయించలేము అని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు.  ఇందులో మతలబేంటంటే.. ఒక వేళ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం అనుకూలంగా ఉందని రిపోర్టు పంపితే..  ఆ ఎన్నికలతోపాటే హుజూరాబాద్ లో కూడా ఉప ఎన్నికలు జరిపేందుకు ఈసీ సిద్ధమవుతుందేమో? అలా అయితే ఎలా? హుజూరాబాద్ లో దళిత బంధు అమలు చేయాలి.. ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు హుజూరాబాద్ బై ఎలెక్షన్స్ జరగకపోయినా కోడ్ అడ్డు వస్తుందేమో? అనే అనుమానాలు కేసీఆర్ మదిలో ఉన్నాయి. ఎందుకొచ్చిన గొడవ.. అసెంబ్లీ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేయిస్తే సరి అనుకున్నాడు.. నిర్వహించలేం అని చెప్పేశాడు. వాస్తవంగా గత జూన్ లో ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసింది.  వారి పదవీ కాలం ముగియక ముందే ఎన్నికల ప్రక్రియ ముగించాలి. అయితే కరోనా కారణంగా ఇది సాధ్యం కాలేదు. ఇపుడు కరోనా తగ్గుముఖం పట్టినా ప్రభుత్వం వాయిదా వేసింది. అంతేమరి.. చేతుల్లో పవర్ ఉంటే.. ఏం చేసినా చెల్లుతుంది.. ఏమంటారు..