లక్కీ కౌశిక్.. కేసీఆర్ తీరుతో టీఆర్ఎస్ నేతలు గప్ చుప్..!

August 2, 2021 at 3:18 pm

కౌశిక్ రెడ్డి నిజంగా లక్కీ ఫెలో అనే చెప్పాలి. లేకపోతే కారు పార్టీలో చేరి ఇంకా పట్టుమని  15 రోజులు కూడా కాలేదు.. అప్పుడే ఎమ్మెల్సీ ఛాన్స్ కొట్టేశాడు.  కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్  పార్టీలో మంచి భవిష్యత్తు ఉంది అని అధినేత కేసీఆర్ చెప్పినట్లుగానే.. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాడు. దీంతో టీఆర్ఎస్ నాయకులే విస్తుపోతున్నారు.  అలా వచ్చి. .ఇలా పోస్టు కొట్టేశాడని సీనియర్ నాయకులే ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఇంకొందరు ఇదేం నిర్ణయమని.. కక్కాలేక.. మింగలేక ఊరికే ఉండిపోయారు. హుజూరాబాద్ నేత కౌశిక్ కు ఎమ్మెల్సీ పదవి ఇద్దామని మంత్రివర్గంలో సీఎం చేసన ప్రతిపాదనకు అవుననాలో..కాదనాలో తెలియక అర్థం కాక మంత్రులు మౌనంగా ఉండిపోయారని తెలిసింది. ఎవరనుకుంటే ఏం.. రాజనుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు..ఆయన ఇవ్వాలనకున్నాడు.. ఇచ్చేశాడు అంతే అని సర్దిచెప్పుకుంటున్నారు.  టీఆర్ఎస్ పార్టీ తరఫున తాను పోటీచేస్తున్నట్లు అతను మాట్లాడిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అనంతర పరిణామాల నేపథ్యంలో కౌశిక్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం..టీఆర్ఎస్ లో అధినేత సమక్షంలో చేరడం.. తరువాత ఎమ్మెల్సీ పోస్టు కొట్టేయడం చక..చకా జరిగిపోయాయి. రాజకీయాల్లో ఇంత వేగంగా కూడా నిర్ణయాలు తీసుకుంటారా అని గులాబి నేతలు గుసగుసలాడుతున్నారు. క్రికెటర్ గా ప్రస్థానం ప్రారంభించిన కౌశిక్ రెడ్డి తరువాత రాజకీయ రంగంలో ఎలా రాణిస్తాడో చూడాలి.

లక్కీ కౌశిక్.. కేసీఆర్ తీరుతో టీఆర్ఎస్ నేతలు గప్ చుప్..!
0 votes, 0.00 avg. rating (0% score)