కొత్త అవ‌తార‌మెత్తిన త‌మ‌న్నా..ఫిదా అవుతున్న నెటిజ‌న్స్‌!

త‌మ‌న్నా భాటియా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2005లో `శ్రీ` అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ మిల్కీ బ్యూటీ.. గ‌త ప‌దిహేను ఏళ్లుగా కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తూనే వ‌స్తోంది. ప్ర‌స్తుతం సినిమాలే కుండా విభిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ప‌లు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది.

Tamannaah Bhatia: I'm back to my pre-Covid body - The Statesman

అలాగే ఈ మ‌ధ్య బుల్లితెర‌పై ప్ర‌సారమ‌వుతున్న ఓ కుక్కింగ్ షోకు హోస్ట్‌గా కూడా మారింది. అయితే ఇప్పుడు ఈ భామ రచయితగా మ‌రొ కొత్త అవతారమెత్తింది. బాలీవుడ్‌ అగ్ర కథానాయిక ప్రియాంకచోప్రా కొన్ని నెలల క్రితం ‘అన్‌ఫినిష్డ్‌’ పేరుతో తన బయోపిక్‌ను వెలువరించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె బాటలో తమన్నా కూడా ఓ పుస్తకాన్ని రచించింది.

Tamanna Bhatia gives us major BFF goals as she enjoys her friend's wedding

అయితే జీవిత చరిత్ర కాకుండా ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన విష‌యాల‌తో ఈ పుస్తకాన్ని రచించింది. `బ్యాక్‌ టు ది రూట్స్‌` అనే శీర్షికతో రాబోతున్న ఈ పుస్తకాన్ని తమన్నా లైఫ్ స్టైల్‌ కోచ్‌ ల్యూక్‌ కోటిన్‌హోతో కలిసి రాసింది. త్వ‌ర‌లోనే ఓ అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ద్వారా ఈ పుస్తకం మార్కెట్‌లోకి రాబోతోంది. ప్రాచీన భారతీయ జీవన విధానం యొక్క గొప్పదనం, శారీరకధారుడ్యం కోసం ఆనాడు ఆచరించిన పద్ధతులు, సుదీర్ఘ జీవనానికి పాటించాల్సిన నియమాల్ని ఈ పుస్తకంలో పొందుప‌రిచార‌ట‌. ఇక మొత్తానికి త‌మ‌న్నాలో ఒక రచయిత కూడా దాగుంద‌ని తెలుసుకుంటున్న అభిమానులు మ‌రియు నెటిజ‌న్లు.. ఆమె టాలెంట్‌కు ఫిదా అవుతున్నారు.