శ్రీదేవి సోడా సెంటర్ సినిమా కి అదే హైలెట్ గా నిలిచిందట..?

పలాస సినిమా డైరెక్టర్ ప్రేమ్ కర్ణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా, రక్షిత హీరోయిన్ గా వచ్చిన చిత్రం”శ్రీదేవి సోడా సెంటర్”. ఈ సినిమా ఆగస్టు 27న బ్రహ్మాండంగా విడుదలైంది. నిజ జీవితంలోని సంఘటనల ద్వారా గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ కథతో ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఒక సోడా సెంటర్ కూతురు, ఒక ఎలక్ట్రీషియన్ ను ప్రేమించడం.. వారి కులాలు వేరు కావడం, వీరి ప్రేమకు వీరి కులాలు అడ్డు రావడం, గ్రామాల్లోని ఉండేటువంటి సాంఘిక ఆర్థిక సామాజిక ఇబ్బందుల వల్ల వీరి ప్రేమ సఫలం అయ్యిందా..? లేదా..? అనేది ఈ సినిమా కథాంశం.

సమాజంలో కుల వివక్షతను తెరపై చూపించడం అనేది ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అలా చూపించిన సినిమా పలాస. ఈ సినిమాతోనే డైరెక్టర్ మంచి హిట్ కొట్టేశాడు చెప్పుకోవచ్చు. ఇక శ్రీదేవి సోడా సెంటర్ చిత్రం కూడా గోదావరి జిల్లా లోని సామాజిక ఆర్థిక కోణాన్ని ఆ నేపథ్యంలో తెరకెక్కించడం జరిగిందట. నటన పరంగా నటీనటులు ఇద్దరు చాలా అద్భుత నటన కనబరిచారు అని ప్రేక్షకులు చెబుతున్నారు.

ఇక ఈ సినిమాలో లైటింగ్ సూరిబాబు గా అద్భుతమైన నటనను కనబరిచారు అనిసుధీర్ బాబు ని ప్రేక్షకులు పొగిడేశారు. ఇక ఈ సినిమాలోని చివరి అరగంట సేపు సినిమా కే హైలైట్గా నిలువనుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక సుధీర్ బాబు , నరేష్ మధ్య మాట్లాడుకునే శ్రీను హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి క్లైమాక్స్ తో వచ్చే తెలుగు సినిమాగా ఉన్నదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక థియేటర్లలో విడుదలైన మొదటి నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో.. రాబోయే రోజుల్లో శ్రీదేవి సోడా సెంటర్ సౌండ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.