చిన్ననాటి ప్రియుడితో సోనమ్‌ కపూర్‌ సోదరి వివాహం..!

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అయిన అనిల్‌ కపూర్‌, సునీతా కపూర్‌ లకు ఇద్దరు కూతుళ్లు అనే విషయం మనకు తెలిసిందే అయితే వారిలో పెద్ద కూతురు సోనమ్ కపూర్ ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక గుర్తింపు సంపాదించుకుంది.అయితే గత కొద్దికాలంగా సోనమ్ కపూర్ లండన్‌లో ఉండగా ఈ మధ్యనే అంటే జూలైలో మళ్ళీ ముంబైకి తిరిగొచ్చింది. తాజాగా అనిల్ కపూర్ చిన్నకూతురు రియా కపూర్‌ ఈరోజు వివాహం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

దాదాపు 13 సంవత్సరాల ప్రేమ తరువాత ఈరోజు అంటే ఆగష్టు 14 న తన ప్రియుడు కరణ్‌ బూలానీని జూహూలోని కపూర్‌ బంగ్లాలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.కరణ్‌ బూలానీ నిర్మాతగా వ్యవహరిస్తునే ఎన్నో రకాల యాడ్స్‌ కూడా నిర్మించారు. అయితే కపూర్ ఫ్యామిలీ వీళ్ళ పెళ్లి గురించి ఎటువంటి వార్తను విడుదల చేయలేదు.కేవలం కపూర్ కుటుంబ సభ్యులు,మిత్రులు మాత్రమే రియా పెళ్ళికి వస్తున్నట్లు తెలుస్తుంది. జుహూలోని అనిల్‌ కపూర్‌ ఇంటి దగ్గర పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.