సోనాక్షి సిన్హా రెమ్యున‌రేష‌న్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న ఆచార్య సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో ఆయన అభిమానులకు ఒక శుభవార్త. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ ను మెగాస్టార్ పూర్తి చేసేసారు. త్వరలోనే విడుదలకు సిద్ధం కూడా అవుతున్నట్లు సమాచారం. అలాగే ఆచార్య సినిమా తర్వాతమ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన లూసిఫ‌ర్ మూవీ రీమేక్ లో కూడా నటించేందుకు రెడీ అవుతున్నారు చిరంజీవి.. ఈ సినిమా తరువాత కేఎస్ ర‌వీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో మరో సినిమాను పట్టాలు ఎక్కించబోతున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా మొదలయినట్లు వార్తలు వస్తున్నాయి.అయితే చిరు-బాబీ ప్రాజెక్టులోప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఫీమేల్ లీడ్ రోల్ లో న‌టిస్తున్న‌ట్టు ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో నటించేందుకు సోనాక్షి సిన్హా ఆఫర్ చేసిన రెమ్యున‌రేష‌న్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సోనాక్షి సిన్హా చిరుతో నటించాలంటే ఏకంగా రూ.3.5 కోట్లు రెమ్యునిరేషన్ అడిగిందని వినికిడి. ఎంతయినా బాలీవుడ్ లో సోనాక్షి సిన్హాకి ఉన్న క్రెజ్ అలాంటిది మరి. ఒకవేళ అన్ని ఓకే అయ్యి సోనాక్షి కనుక బాబీ-చిరంజీవి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సినిమాకు ప్లస్ అవ్వడం ఖాయం అంటున్నారు సినీ వర్గ విశ్లేషకులు. మరి సోనాక్షి డిమాండ్ చేసిన రెమ్యునిరేషన్ ఇవ్వడానికి మేక‌ర్స్
రెడీగా ఉన్నారా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. మరి కొద్ది రోజుల్లో ఈ విషయంపై అధికారికంగా సమాచారం రానుందని తెలుస్తుంది.

Share post:

Latest