మ‌హేష్ బ‌ర్త్‌డే..సితార ఎమోష‌న‌ల్ పోస్ట్ వైర‌ల్‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు 46వ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు అభిమానుల నుంచి, సినీ ప్ర‌ముఖుల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మ‌హేష్ గారాల ప‌ట్టి సితార కూడా తండ్రికి త‌న‌దైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది.

Mahesh Babu and Sitara's CANDID moments prove they are the cutest father  and daughter duo in town

`ప్రపంచానికి మీరు సూపర్ స్టార్ , కాని మాకు మీరే ప్ర‌పంచం. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా . మీరు మాకు బెస్ట్ డాడ్. ఆడుకోవడం, నవ్వడం, పాడటం, డ్యాన్స్ చేయడంతో పాటు మాతో స‌ర‌ద‌గా ఉన్నందుకు ధ‌న్య‌వాదాలు. ఇప్పుడే కాదు ఎప్పుడు మిమ్న‌ల్ని ప్రేమిస్తూనే ఉంటాను` అని సితార సోష‌ల్ మీడియా ద్వారా ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్ట‌గా.. ఆమె పోస్ట్ కాస్త వైర‌ల్‌గా మారింది.

Mahesh Babu's Daughter Sitara Shares A Handwashing Tutorial To Prevent  Coronavirus! - Filmibeat

నటశేఖర కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో మహేష్‌బాబు.. త‌న‌దైన అందం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించి సూప‌ర్ స్టార్ స్థాయికి ఎదిగాడు. ఇక నాలుగు ప‌దుల వ‌య‌సులోనూ నవ మన్మథుడిగా క‌నిపిస్తూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న మ‌హేష్‌.. ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు.

Share post:

Popular