పెళ్లికి ముందు అలా..పెళ్లి తర్వాత ఇలా ఉంటున్నారు..సునీత ఆవేద‌న‌

టాలీవుడ్ టాప్ సింగ‌ర్‌, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌లె డిజిటల్ మీడియా రంగంలో రాణిస్తున్న రామ్ వీరపనేనిని సునీత రెండో వివాహం చేసుకుని.. వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. అయితే సునీత రెండో పెళ్లిపై ఎన్నో చ‌ర్చ‌లు న‌డిచాయి. ఎంద‌రో ఆమెపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

అయిన‌ప్ప‌టికీ..అవేవీ పెద్దగా పట్టించుకోకుండా, నెగెటివ్ కామెంట్స్‌ని తిప్పికొడుతూ సునీత తన మ్యారేజ్ లైఫ్ లీడ్ చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న సునీత‌.. కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను అంద‌రితోనూ పంచుకున్నారు. సునీత మాట్లాడుతూ..పెళ్లి కాకముందు చాలామంది మాట్లాడేవారు. కానీ ఎప్పుడైతే రామ్‌ను పెళ్లి చేసుకున్నానో.. అప్ప‌టి నుంచి సడెన్‌గా మాట్లాడటం మానేశారని చెప్పుకొచ్చారు.

ఇంకా చెప్పాలంటే తన పెళ్లి చాలామందికి ఇష్టం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అయితే మనకంటూ ఓ మనసు ఉంటుంది. దాన్ని సొసైటీలో చాలా మంది ప‌ట్టించుకోరు. అందుకే తాను ఎవరి గురించి పట్టించుకోనని, తాను చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్తానని చెప్పుకొచ్చారు. దాంతో ఇప్పుడు సునీత కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

Share post:

Popular