మెగాస్టార్ మూవీ లో ప్రజా గాయకుడు గద్దర్ కీలకపాత్ర?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమా అనంతరం మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాలో నటించబోతున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయినా లూసిఫర్ సినిమాను తెలుగు రీమేక్ ఇది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రజా నాయకుడు గద్దర్ ఒక కీలక పాత్ర లో నటినంచబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇందుకోసం దర్శక, నిర్మాతలు గద్దర్ సంప్రదించారని తెలుస్తోంది. పాత్ర నచ్చడంతో అందుకు గద్దర్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా తర్వాత షెడ్యూల్ లో గద్దర్ పార్ట్ షూటింగ్ సినిమాను రిలీజ్ చేయనున్నారని సమాచారం . ఈ సినిమాను వైజాగ్ జైలులో చిత్రీకరించనున్నారు. ఈ సన్నివేశాల్లో గద్దర్ పాల్గొనబోతున్నారట. ఈయనతోపాటు గాసల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Share post:

Popular