సైనికుడు పాత్రలో మెప్పించిన సినిమాలు..

ఈ రోజున మనం 75 వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం. ఈ రోజు స్వాతంత్ర సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగుర వేయడం ఆనవాయితీగా వస్తున్నది.”జై జవాన్.. జై కిసాన్”అని మన దేశ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నినాదం ఇచ్చారు. ఈ స్ఫూర్తితోనే తెలుగు తెరపై అప్పుడప్పుడు మన హీరోలు కూడా కొన్ని సినిమాలలో సైనికులు పాత్రల్లో కనిపించారు..అలాంటి సినిమాలు చూద్దాం.

1). మహేష్ బాబు:
సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా లో ఫస్ట్ టైం మేజర్ అజయ్ గా కనిపించారు.

2). నాగ చైతన్య:
వెంకీ మామ సినిమాలో తొలిసారిగా సైనికుడు పాత్రలో నటించి మెప్పించాడు అక్కినేని నాగ చైతన్య. ఇక తాజాగా లాల్సింగ్ చద్దా సినిమాలో కూడా అమీర్ ఖాన్ తో కలిసి నటిస్తున్నట్లు తెలుస్తోంది.

3). అల్లు అర్జున్:
అల్లు అర్జున్ కూడా నా పేరు సూర్య సినిమాలో సైనికుడి పాత్రలో కనిపించారు.

4). ఆది:
సాయికుమార్ తనయుడు ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమాలో సైనికులు పాత్రలో కనిపించి అదరగొట్టేశాడు.

5). ఆకాష్ పూరి:
పూరి జగన్నాథ్ తనయుడు మెహబూబా సినిమాలో పాకిస్తాన్ సైనికుడీ పాత్రలో నటించాడు.

6). వరుణ్ తేజ్:
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కించిన కంచి చిత్రంలో సైనికులు పాత్రల్లో అలరించాడు వరుణ్ తేజ్

7). రానా దగ్గుబాటి:
ఘాజి సినిమాలో నేవీ ఆఫీసర్ గా మెప్పించాడు రానా.

8). అడవి శేషు:
మహేష్ బాబు నిర్మాణంలో శశికిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 అటాక్ జరిగిన సంఘటన ను కథ రూపంలో తెరకెక్కిస్తున్న మేజర్ సినిమాలో అడవి శేషు ఒక ముఖ్యమైన సైనికుడు పాత్రలో నటిస్తున్నాడు.

ఇక అంతే కాకుండా నాని వి సినిమా, బాలకృష్ణ పరమవీరచక్ర, చిరంజీవి యుద్ధభూమి, రాజశేఖర్ మగాడు, రవితేజ చంటి, జగపతిబాబు అడవిలో అభిమన్యుడు, సుమంత్ స్నేహమంటే ఇదేరా వంటి సినిమాలలో నటించి కనువిందు చేశారు.