`అఖండ‌`పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన త‌మ‌న్‌..ఖుషీలో బాల‌య్య ఫ్యాన్స్‌!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `అఖండ‌`. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు.

ఎస్‌.త‌మ‌న్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్‌లో విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాపై త‌మ‌న్ ఓ సాలిట్ అప్డేట్ అందించాడు.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే..ఈ సినిమా ఆడియో ఆల్బమ్ నుండి మొదటి సింగిల్ అతి త్వరలోనే రానున్నట్టు త‌మ‌న్ తాజాగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించాడు. త‌మ‌న్ ట్వీట్ బ‌ట్టీ చేస్తుంటే అఖండ ఫ‌స్ట్ సింగిల్‌కు డేట్ లాక్ అయింద‌ని, త్వ‌ర‌లోనే దానిని ప్ర‌క‌టించ‌నున్నార‌ని స్ప‌ష్టంగా అర్థం అవుతోంది. ఈ నేప‌థ్యంలోనే బాల‌య్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

Share post:

Popular