ఎస్ ఆర్ కళ్యాణమండపం ఫస్ట్ డే కలెక్షన్స్ ..!

August 7, 2021 at 9:37 am

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా చిన్న హీరోల హవానే జరుగుతోంది. అయితే ఇప్పుడు యువ హీరో అయినటువంటి కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ కలిసి నటించిన తాజా చిత్రం ఎస్.ఆర్.కళ్యాణమండపం. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 6న విడుదల అయింది. అయితే ఈ సినిమా కరోనా తర్వాత విడుదల కావడం విశేషం.

ఇక ఈ సినిమా ట్రైలర్ తో పాటు, సాంగ్స్ కూడా సూపర్ హిట్ అవ్వడం మరో విశేషం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 500 థియేటర్లు పైగా విడుదలైంది. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే ఫస్ట్ ఓపెనింగ్ గా తెలుగు రాష్ట్రాలలో రూ.1.3 కోట్ల మేరకు రానిచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఓవర్ సీస్ లో కూడా మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే రూ.4.55 కోట్ల రూపాయల మేరకు జరిగింది. కానీ ఈ సినిమా వేసిన అంచనా రూ.4.8 కోట్ల రూపాయలతో విడుదల కాగా మొదటి రోజే సాలిడ్ కలెక్షన్లను దక్కించుకోవడంతో నిర్మాతలు ఎంతో సంతోషంగా ఉన్నట్లు సమాచారం.

ఇది సినిమా లో సీనియర్ నటుడు సాయి కుమార్ నటన ఎంత అద్భుతంగా ఉంది అంటూ ప్రేక్షకులు తెలియజేశారట. ఇక ఈ సినిమాలో హీరో కూడా తనదైన శైలిలో అద్భుతమైన నటతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇక అంతే కాకుండా ఈ సినిమా కథతో పాటు స్క్రీన్ ప్లే, బాగా ఉండడం విశేషం. ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ సంగీతం అందించాడు.

ఇక ఏది ఏమైనా కరోనా తర్వాత విడుదలైన సినిమా కాబట్టి ఎంతవరకు కలెక్షన్లు రాబడుతోంది అనే విషయం కొద్ది రోజులు ఆగాల్సిందే.

ఎస్ ఆర్ కళ్యాణమండపం ఫస్ట్ డే కలెక్షన్స్ ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts