వీడియో: హాట్ డాన్స్ తో సైగలు పుట్టించిన బిగ్‌బాస్ స్టార్!

ప్రముఖ నటి రుబినా దిలైక్ సోషల్ మీడియాలో తన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ తన ఫ్యాన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తుంటుంది. బుల్లితెర రంగంలో తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్న ఈమె బిగ్‌బాస్ సీజన్ 14లో గెలిచి తన పాపులారిటీని విపరీతంగా పెంచుకుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. కిడి రూపొందించిన వైరల్ రీల్ సాంగ్ ‘టచ్ ఇట్’ కు రుబినా డ్యాన్స్ చేసింది. ఆమె సెక్సీ డ్యాన్స్ స్టెప్పులతో సెగలు పుట్టించింది. దాంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో ఒక లగ్జరీయస్ స్విమ్మింగ్ పూల్ వద్ద ఆమె డాన్స్ చేస్తూ కనిపించింది. జుట్టును చక్కగా ముడివేసుకుని ఆమె తన బొడ్డు అందాలను చూపిస్తూ అభిమానులను చూపుతిప్పుకోకుండా చేసింది. ఈ లేడీ సెలబ్రిటీ తన పుట్టిన రోజు సందర్భంగా అనగా ఆగస్టు 26న ఈ వీడియో చేసినట్లు తెలిపింది.

Share post:

Latest