రైస్ కుక్కర్ లో అన్నం వండుతున్నారా..అయితే అంతే..?

ఈ మధ్య కాలంలో మనం వంట ఎలా చేస్తున్నామో మీ అందరికీ తెలిసిన విషయమే. పూర్వకాలంలో మనం అన్నాన్ని వండటానికి ఒక గంట ముందు నుంచే బియ్యాన్ని నానబెట్టి, ఆ బియ్యాన్ని కట్టెల పొయ్యి మీద పెట్టి వండేవారు. ఆ అన్నం అయిన తరువాత అందులో ఉన్న నీళ్ళని సిబ్బి సహాయంతో అన్నం వార్చేవారు.. కానీ ఇప్పుడు అలా కాదు.. మనకి ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి రావడం వల్ల చాలా ఈజీ అయిపోయింది. అది ఏంటంటే రైస్ కుక్కర్ లాంటి వస్తువులలో అన్నం వండటం వలన చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంతేకాకుండా ఆ కాలంలో అన్నం చేయాలంటే బాగా ఉడికించి, ఉడికి అన్నం పట్టుకుని చూసి బాగా ఉడికిందా లేదా చూసి అన్నాన్ని వార్చేస్తాము. ఆ తర్వాత అందులో కొంచెం వాటర్ ఉంటుంది..కాబట్టి మరి అన్నాన్ని పొయ్యిమీద పెడతాము.. అప్పుడు తేమ మొత్తం ఆవిరి అవుతుంది.

ఇక ఈ రోజుల్లో అయితే ఇక చెప్పనవసరం లేదు.. రైస్ కుక్కర్ రావడం వలన చాలామందికి అన్నం చేయడం ఈజీ అయింది. కానీ రైస్ కుక్కర్లో అన్నం వండటం వలన అన్నం విషపూరితం అవుతుంది. ఇలాంటి వాటిలో అన్నం వండుకొని తినడం వల్ల మన శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. మనతో పోల్చుకుంటే పూర్వీకులు ఎంతో బలంగా , దృఢంగా ఉండేవారు. ఇకపోతే ఈ రైస్ కుక్కర్ వలన 20 ఏళ్లకే కాళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళు అరిగిపోవడం వంటి ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి.

కాబట్టి వీలైనంత వరకు అన్నం వండాలి అంటే తప్పకుండా మట్టి పాత్రలు ఉపయోగించడం ఎంతో శ్రేయస్కరం. మట్టి పాత్రలో వంట చేసుకొని తినడం వల్ల శరీరానికి కావాల్సిన మినరల్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి.