ఆర్జీవి చేసిన పనికి…ఆషురెడ్డి.. ఫోటోస్ వైరల్..?

టాలీవుడ్ లో రాంగోపాల్ వర్మ విభిన్నమైన దర్శకులలో ఒకరు. రాంగోపాల్ వర్మ ఒకానొక సమయంలో సాధారణ హీరోలను స్టార్ హీరోలుగా మార్చేశాడు. ఇక అంతే కాకుండా అప్పట్లో మాస్ సినిమాలకు రాంగోపాల్ వర్మ పెట్టింది పేరు . ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈయన నటులతో కాలక్షేపాలు చేస్తూ ఉన్నాడు. అయితే తన పాపులారిటీ కోసం ఆషు రెడ్డి, రాంగోపాల్ వర్మ తో మాట్లాడడానికి వెళ్లిన చోట కొన్ని ఫొటోలు వైరల్ గా మారాయి..ఇక వాటి వివరాలను చూద్దాం.

బుల్లితెరపై ఆశు రెడ్డి అంటే అందరికీ సుపరిచితమే. ఈమె సోషల్ మీడియా ద్వారా తనకంటూ కొంత మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. అలా సంపాదించుకున్న వాటిలోనే బుల్లితెరపై బిగ్ బాస్- సీజన్ 3 లో పాల్గొన్నది ఈ అమ్మడు. ఇక అంతే కాకుండా ఈ మధ్యకాలంలో మా టీవీలో ప్రసారమయ్యే ఒక షోలో కూడా ఈమె కనిపిస్తూ ఉంది. తెలుగులో డబ్‌స్మాష్‌ల పుణ్యాన పాపులారిటీ తెచ్చుకుని సినిమాల్లో ఛాన్స్‌ల కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్న వారిలో అషు రెడ్డి ఒకరు. బిగ్‌బాస్ సీజన్ 3తో బుల్లితెరకు సుపరిచితురాలిగా మారిన అషురెడ్డికి సోషల్ మీడియాలో చెప్పుకోదగ్గ ఫాలోవర్లే ఉన్నారు.

ఇక రాంగోపాల్ వర్మ ను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళిన ఆశు రెడ్డి. తన తో దిగిన కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం ద్వారా.. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు, ఆమె రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లినట్లు లేదు.. అని కామెంట్ చేస్తున్నారు. వీరు చేస్తున్నటువంటి పని వల్ల రాంగోపాల్ వర్మ, అరియానా చేసిన తీరు గుర్తుకొచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారట నెటిజన్లు. ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసే యాంకర్లు హాట్‌గా.. చిట్టిపొట్టి దుస్తులు ధరించి అతని వద్దకు వెళ్లడం ఈ మధ్య అలవాటుగా మారింది. పలు యూట్యూబ్ ఛానళ్ల యాంకర్లు ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసేందుకు హాట్‌గా తయారయి వెళుతున్నారు. తాజాగా అషురెడ్డి కూడా రాంగోపాల్ వర్మ వద్దకు అలానే వెళ్లింది. అయితే.. ఆమె ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన వీడియో చూస్తే ఏదో ఇంటర్వ్యూకు వెళ్లినట్టుగా అనిపిస్తోంది. కానీ.. ఆ వీడియోలో అషురెడ్డి ధరించిన దుస్తులు.. ఆమె చేస్తున్న ఎక్స్‌పోజింగ్.. రాంగోపాల్ వర్మ రియాక్ట్ అయిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఈమె ఇదంతా కేవలం పాపులారిటీ సంపాదించుకోవడం కొరకు మాత్రమే చేసినట్లు మరికొంత మంది అనుకుంటున్నారు. ఇక ఈ వీడియో చూసిన వారందరూ రామ్ గోపాల్ వర్మ, తన హీరోయిన్లను ఎలాంటి యాంగిల్ లో చూపిస్తారో..? ఎలాంటి యాంగిల్ లో ఒక ఫోటో ని పోస్ట్ చేస్తారో అంటూ కామెంట్ చేస్తున్నారు. దీంతో.. ఆర్జీవీని హాట్ హాట్ డ్రెస్ ధరించి ఇంటర్వ్యూ చేస్తే మరింత ఫేమస్ అవ్వొచ్చన్న ఆలోచనో లేక తాను ఎంత బోల్డ్‌గా ఉంటుందో నిరూపించుకోవాలన్న తాపత్రయమో తెలియదు గానీ.. అషు రెడ్డి ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది.