రవితేజ ఖిలాడి సినిమాతో రిస్క్ చేస్తున్నాడా ..?

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమాతో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా, గ్రాండ్ ఓపెనింగ్ ఇచ్చాడు మన మాస్ మహారాజ్ రవితేజ. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడంతో ఆయనకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాక్షసుడు సినిమా తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ రమేష్ వర్మ కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక సక్సెస్ఫుల్ డైరెక్టర్ రమేష్ వర్మ, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఖిలాడి..

ఈ సినిమాలో రవితేజ డ్యుయల్ పాత్రలో మనకు కనిపించబోతున్నారు. ఇకపోతే రమేష్ వర్మ తన పుట్టినరోజు సందర్భంగా ఖిలాడి సినిమా గురించి కొన్ని వాక్యాలు తెలిపాడు. సాధారణంగా రవితేజ సినీ కెరీర్ లో 60 కోట్లు రాబట్టిన సినిమాలు ఉన్నాయి కానీ, అంతకంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు ఏ ఒక్కటీ లేవు. అందుకే ఏకంగా 65 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఆయన తెలపడంతో ప్రస్తుతం ఈ వార్త సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

అంతేకాదు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది అనే నమ్మకం ఉందని, తప్పకుండా రెట్టింపు స్థాయిలో షేర్ ను రాబడుతుంది అని రమేష్ వర్మ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఇక ఈ సినిమా కనుక మంచి విజయాన్ని అందుకుంటే ,అటు రమేష్ వర్మ కు ,ఇటు రవితేజకు వరుస ఆఫర్లు వస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.