రాష్ట్రపతిగా ఆ వ్యక్తి ఎన్నుకోవడం మేలంటున్న నాగబాబు..?

కొన్ని నెలల క్రితం వరకు బుల్లితెరపై ఎంతో హంగామా సృష్టించాడు నాగబాబు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉన్నాడు. అలా ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు నాగబాబు. అయితే తాజాగా రాష్ట్రపతి అంశంపై గురించి నాక్ అవుట్ చేయడం వల్ల ఆ విషయం కాస్త వైరల్ గా మారింది.

దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇక ఇలాంటి సమయంలో దేశాన్ని బాగా ఇష్టపడే వ్యక్తి రాష్ట్రపతి అయితే బాగుంటుందని నాగబాబు తెలియజేశారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు చాలా దిగజారిపోతున్నాయి. తదుపరి రాష్ట్రపతిగా దేశాన్ని కుటుంబంలా ప్రేమించే వ్యక్తిని నియమించుకోవడం మంచిదని అంటున్నారు.

రాజకీయంగా, ప్రజలను ఇబ్బంది పెట్టే వ్యక్తి రాష్ట్రపతి కాక పోవడమే మంచిది అని తెలియజేశారు నాగబాబు. అంతేకాకుండా టాటా స్థాపకుడు”రతన్ టాటా” ను రాష్ట్రపతికి ఎన్నుకోవడం మంచిదని అంటున్నారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా కొంత మంది రతన్ టాటా గురించి ఎంత గొప్పగా చెప్పారు అండి అని కూడా తెలియజేశారు.

నాగబాబు మాటలు మరొక సంచలనానికి దారి తీశాయనే చెప్పాలి. వచ్చే రాష్ట్రపతి కాలం ముగియనుంది. గత కొద్ది రోజుల నుండి రాష్ట్రపతి ఎవరు ఉంటారనే విషయంపై చర్చలు కొనసాగుతుండటంతో ,నాగ బాబు ఈ విధంగా మాట్లాడడం వల్ల పలు నెటిజన్లు మద్దతు కూడా వస్తున్నట్లు తెలుస్తుంది. ఇక రతన్ టాటా దేశ ప్రజలకు ఎంతో కష్ట సమయాల్లో బాగా ఆదుకుంటాడని, అంతే కాకుండా అతను బాగా అందరికీ సుపరిచితమైన వ్యక్తి అని అందుచేత రాష్ట్రపతి అయితే బాగుంటుందని తెలియజేశాడు నాగబాబు. కానీ రాష్ట్రపతి అనే వ్యక్తి రాజకీయంగా ఆలోచించకుండా ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటూ, కష్ట సమయాల్లో , ఆపద సమయాల్లో తోడుగా ఉండాలి. ముఖ్యంగా దేశంలోని యువత ను ఒక సరైన మార్గంలో నడిపించేందుకు పాటుపడాలి. అప్పుడే ఆ రాష్ట్రపతి పదవికి మరింత ప్రాముఖ్యత చేకూరుతుంది.https://twitter.com/NagaBabuOffl/status/1424649665971060736?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1424649665971060736%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ffilmyfocus.com%2Ftelugu%2Fnaga-babu-interesting-comments-about-ratan-tata%2F