`ఫ్రెండ్షిప్ డే`ను ఎనిమీ డే మార్చిన‌ ఆర్జీవీ..నెటిజ‌న్లు ఫైర్‌!

నేడు ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే అన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే అంద‌రూ త‌మ త‌మ మిత్రుల‌తో క‌లిసి ఈ ప్ర‌త్యేక‌మైన రోజును ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఫ్రెండ్షిప్ డే పై వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది.

`స్నేహితుడికి సాయం చేస్తే ఓ స‌మ‌స్య వ‌స్తుంది. వాడికి మ‌రోసారి సాయం అవ‌స‌ర‌మైన‌ప్పుడు కూడా మ‌ళ్లీ నీ ద‌గ్గ‌రికే వ‌చ్చి అడుతాడు` అని ట్వీట్ చేశాడు. అక్క‌డితో ఆగ‌ని మ‌న ఆర్జీవీ మ‌రో ట్వీట్‌లో.. `శత్రువుల గురించి మంచి విషయం ఏమిటంటే, స్నేహితులు చేసినట్లు వారు మీకు ద్రోహం చేయలేరు. అలాగే స్నేహితుల మాదిరి శ‌త్రువులు వెన్నుపోటు పొడ‌వ‌రు. వారి మిమ్మ‌ల్ని థైర్యంగా ఎదుర్కొంటారు.

ఇక శ‌త్రువులు మీ బ‌లాన్ని అంచ‌నా వేస్తే.. స్నేహితులు మీ బ‌లాన్ని అణ‌చివేస్తారు. అందుకే అంద‌రికీ హ్యాపీ ఎనిమీస్ డే` అంటూ రాసుకొచ్చాడు. అయితే వ‌ర్మ చేసిన వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. స్నేహానికి ఉన్న విలువ‌ను చెడ‌గొడుతున్నారంటూ వ‌ర్మ‌పై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే వ‌ర్మ‌ను స‌మ‌ర్థిస్తున్న వారూ లేక‌పోలేదు.