పుష్ప నెక్స్ట్ సాంగ్ పై.. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప.ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అంతే కాకుండా ఈ సినిమాను రెండు విభాగాలుగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకి హైప్ పెరగడానికి గల కారణం ఏమిటంటే.. ఈ సినిమాలోని పాటను, కొన్ని క్లిప్ లు లీక్ కావడంవల్ల ఈ సినిమా బాగా హైప్ ను సంపాదిస్తోంది.

ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మొదటి పాట విడుదలై భారీ రెస్పాన్స్ ని అందుకుంది.అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండవ పాట కోసం చాలా ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు అభిమానులు. ఇక ఈ సినిమాకి సంబంధించి రెండో సాంగ్ డ్యూయోట్ ని రిలీజ్ చేయనున్నట్టు గా సినీ వర్గాలలో ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఈ చిత్రం నుంచి పాట విడుదల అయ్యే కి ఇంకా కొద్దిగా సమయం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది సాధారణంగా అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు అంటే వీరి నుంచి వచ్చే ఆల్బమ్స్ ఏ రేంజిలో ఉంటాయో ప్రేక్షకుల్లో కూడా అంతే స్థాయిలో అంచనాలు పెరుగుతూ ఉంటాయి. ప్రేక్షకుల అంచనాలను మ్యాచ్ చేసుకొని ఆల్బం రిలీజ్ చేయాలి అంటే చాలా సమయం పడుతుంది కాబట్టి తప్పకుండా ఫుల్ ఆల్బమ్ లోనే వస్తుంది అని సినిమా మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. ప్రేక్షకులు మెచ్చే సరికొత్త ఆల్బమ్ రావాలి అంటే అల్లు అర్జున్ అభిమానులు మరి కొంత సమయం వేచి ఉండాల్సిందే.

Share post:

Popular