పుష్పలో బాహుబలి.. కత్తి దిగాల్సిందే!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పుష్ప’ కూడా ఒకటి. ఈ సినిమాకు ఎలాంటి హైప్ క్రియేట్ అయ్యిందో ఇప్పటికే మనం చూస్తున్నాం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను పూర్తిగా ఊరమాస్ లుక్‌లో ప్రేక్షకులను చూపిస్తూ పుష్పరాజ్ పాత్రతో బన్నీ కెరీర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లేందుకు సుక్కు ప్రయత్నిస్తున్నాడు. కాగా పుష్ప చిత్రంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి షేడ్స్ ఉండబోతున్నట్లు సినీ వర్గాల్లో తెగ చర్చ సాగుతోంది.

పుష్ప చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తు్న్నారు చిత్ర యూనిట్. మొదటి భాగానికి ‘పుష్ప-ది రైజ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మొదటి భాగంలో పుష్పను ఓ వ్యక్తి వెన్నుపోటు పొడుస్తాడట. బాహుబలి చిత్రంలో ప్రభాస్‌ను కట్టప్ప ఎలా వెన్నుపోటు పొడిచాడో ఆ రీతిలోనే ఈ సినిమాలో కూడా పుష్పను దారుణంగా మోసం చేస్తాడట ఈ సినిమాలోని కట్టప్ప. ఇంతకీ ఈ సినిమాలో కట్టప్ప తరహా పాత్రలో ఎవరు నటిస్తున్నారో మీకు తెలుసా.. నటుడు సునీల్. అవునుండి.. పుష్పరాజ్‌ను వెన్నుపోటు పొడిచే పాత్రలో సునీల్ విలక్షణమైన నటనను కనబర్చనున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి పుష్ప చిత్రంలో బాహుబలి షేడ్స్ పుష్పలంగా ఉండబోతున్నట్లు ఈ ఒక్క వార్తతో మనకు అర్థమవుతోంది. కాగా ఈ సినిమా పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంతేగాక ఈ సినిమాలో విలన్ పాత్రలో మలయాళ నటుడు ఫాహద్ ఫజిల్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌కు చేరుకున్నాయి. మరి పుష్పరాజ్‌ను సునీల్ ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.