చేతిలో క‌త్తి, మ‌రోవైపు వ‌ర్షం..ప్రీ లుక్‌తోనే పిచ్చెక్కించిన నాగ్‌!

టాలీవుడ్ కింగ్ నాగార్జున, డైరెక్ట‌ర్ ప్రవీణ్ సత్తారు కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ్‌కు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

It's Official! Nagarjuna joins hands with Praveen Sattaru for a slick  action thriller | Telugu Movie News - Times of India

ఈ మ‌ధ్యే ఈ చిత్రం సెట్స్ పైకి కూడా వెళ్లింది. అయితే తాజాగా నాగార్జున ఫేస్ ను రివీల్ చేయకుండా ప్రీ లుక్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ ప్రీ లుక్ చాలా ఇంట‌స్ట్రింగ్ గా ఉంది. పూర్తి బ్లాక్ కలర్ డ్రెస్ ను ధ‌రించిన నాగ్‌.. నెత్తుటి ధారలతో తడిసిన క‌త్తిని పట్టుకుని వ‌ర్షంలో నిల‌బ‌డి ఉన్నారు.

Image

మొత్తానికి పిచ్చెక్కిస్తున్న ఈ ప్రీ లుక్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇక ఈ ప్రీ లుక్ పోస్ట‌ర్‌లో వచ్చే 29వ తారీఖున మరో సాలిడ్ అప్డేట్ ఇవ్వ‌బోతున్న‌ట్టు కూడా మేక‌ర్స్ తెలియ‌జేశారు. బహుశా అప్పుడు టైటిల్ తో కూడిన ఫస్టులుక్ పోస్టర్ ను వదిలే అవకాశం ఉంద‌ని టాక్ న‌డుస్తోంది.

Share post:

Latest