నటుడు ప్రకాష్ రాజ్ కి గాయాలు…?

విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు యాక్సిడెంట్ అయింది. ప్రకాశ్ కాలికి తీవ్రమైన ఫ్యాక్చర్ జరిగింది. ఈ విషయాలను స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ క్రమంలోనే తన ఆరోగ్యం బానే ఉన్నట్లు, సర్జిరీ కోసం తన స్నేహితుడు డాక్టర్ గురువా‌రెడ్డి దగ్గరకు తెలంగాణలోని హైదరాబాద్‌కు వస్తున్నట్లు ప్రకాశ్ తెలిపారు. తన హెల్త్ విషయమై ఫ్యాన్స్ ఆందోళన చెందొద్దని, తను హెల్దీగానే ఉన్నట్లు ప్రకాశ్ చెప్పారు.

ఇకపోతే ప్రకాశ్‌కు యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఎవరు చేశారు? అనే విషయాలు తెలియరాలేదు. ప్రకాశ్ యాక్సిడెంట్ విషయం తెలుసుకుని టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పలువురు ప్రకాశ్ ట్రీట్‌మెంట్ విషయమై డాక్టర్ గురువారెడ్డికి ఫోన్ చేసినట్లు సమాచారం. తెలుగులో ఇటీవల ఆయన పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి ‘వకీల్‌సాబ్’ చిత్రంలో నటించారు. ఈ ఫిల్మ్‌లో ఆయన నటనకుగాను సినీ ప్రముఖులతో పాటు ప్రేక్షకుల నుంచి ప్రశంసల వర్షం కురిసింది. ప్రకాశ్ ప్రస్తుతం తెలుగులో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ చిత్రంతో పాటు పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వస్తున్న ‘లైగర్’ ఫిల్మ్‌లో కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.

Share post:

Latest