నో షూటింగ్‌..ఇట్స్ డ్యాన్సింగ్‌ టైమ్ అంటున్న ప్ర‌భాస్!?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `ఆదిపురుష్` ఒక‌టి. రామాయణం నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇటు హిందీతో పాటు, తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ, క‌న్న‌డ‌ భాష‌ల్లో విడుదలకానుంది.

Om Raut on casting Prabhas as Lord Ram in Adipurush: He is perfect for the  role | Entertainment News,The Indian Express

ఈ చిత్రంలో రాముడిగా ప్ర‌భాస్‌, సీతగా కృతీ సనన్‌, లక్ష్మణుడిగా సన్నీసింగ్‌, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు. ప్ర‌స్తుతం ముంబైలో ఆదిపురుష్ షూటింగ్ జ‌రుగుతోంది. ప్ర‌భాస్ కూడా ముంబైలోనే ఉన్నారు. కానీ, షూటింగ్‌లో పాల్గొనడం లేదు. మరేం చేస్తున్నాడు అనేగా మీ డౌట్.. ఇట్స్‌ డ్యాన్సింగ్‌ టైమ్‌ అంటూ రిహార్సల్స్‌ చేస్తున్నారు.

Kriti Sanon, Sunny Singh join cast of Prabhas-starrer 'Adipurush' - The  Hindu

అవును, ఈ సినిమాలో ఓ భారీ బడ్జెట్‌ పాట ఉండనుందని తెలుస్తోంది. ఈ పాట కోసమే ప్రస్తుతం ప్రభాస్‌, కృతీ సనన్‌, సైఫ్‌ అలీఖాన్ రిహార్సల్స్‌ చేస్తున్నారని సమాచారం. నాలుగు రోజులుగా ఓ స్టూడియోలో రిహార్సల్స్‌ జరుగుతున్నాయ‌ని తెలుస్తోంది. ఇక రిహార్సల్స్ పూర్తి అయిన వెంట‌నే ఆ సాంగ్‌ను చీత్రీక‌రించ‌నున్నార‌ట‌. ఇక ఇది ప్రమోషనల్‌ సాంగ్‌ అని టాక్‌. ఈ పాట పూర్తయ్యాక ప్రభాస్, సైఫ్, కృతీ కాంబినేషన్‌లో కీలక సన్నివేశాలను షూట్ చేసేందుకు ప్లాన్‌ చేశారట.

Share post:

Latest