పవన్ బర్త్ డే.. బండ్ల గణేష్ సర్ప్రైజ్ గిఫ్ట్ రెడీ!

రేపు నెల అనగా సెప్టెంబర్ 2 నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే రాబోతోంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన బండ్ల గణేష్ అభిమానులకు సర్ప్రైజింగ్ ఇవ్వబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా గబ్బర్ సింగ్. ఈ సినిమా బాలీవుడ్ హిట్ దబాంగ్ సినిమాకు అఫీషియల్ రీమేక్ గా తెలుగులో రూపొందించారు. ఈ సినిమాతో అప్పటివరకు ఐరన్ లెగ్ అనే టాక్ ఉన్న శృతిహాసన్ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సిని మా 2011 మే 11న విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.

అయితే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను మళ్లీ సినిమా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు బండ్ల గణేష్ ట్వీట్ చేశారు రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లలో సెప్టెంబర్ రెండవ తేదీన గబ్బర్ సింగ్ సినిమాను 100 పూలతో విడుదల చేయాలనుకుంటున్నాను అని అలాగే ఈసారి పవన్ పుట్టిన రోజు వేడుకలను థియేటర్లలో జరుపుకుందామని బండ్ల గణేష్ తెలిపారు.