ఆగస్టు 15 న రాబోతున్న బీమ్లా నాయక్.. !!

పవన్ కళ్యాణ్ పేరు వింటే చాలు అభిమానులకు పండగే పండగే. ఆయన సినిమా రిలీజ్ అంటే చాలు అభిమానుల కోలాహలం మాములుగా ఉండదు. అయితే పవన్ కళ్యాణ్ నటించే కొత్త సినిమా గురించి ఒక మంచి అప్డేట్ వచ్చేసింది. పవన్, రానా కాంబినేషన్‌లో వస్తోన్న తమిళ రీమేక్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా మీద అభిమానులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్.

ఈ సినిమాలో  పవన్ కళ్యాణ్ ఖాకీ డ్రెస్సు ధరించి పవర్ ఫుల్ పాత్ర అయిన భీమ్లా నాయక్ అనే పాత్రలో నటించనున్నారు.అయితే ఎప్పుడెప్పుడు ఈ మూవీకి సంబందించిన కొత్త అప్డేట్ వస్తుంది అని ఎదురుచూసే అభిమానులకు శుభవార్త. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ తో పాటు మూవీ ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్‌ను స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా అంటే ఆగస్ట్ 15న ఉదయం 9 గంటల 45 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.