రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర.ఈ సినిమా ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది.రాజకీయాల్లో తిరుగులేని మనిషిగా అభిమానులను సంపాదించారు రాజశేఖర్ రెడ్డి. ఇక అదే విధంగా ఎన్టీఆర్ బయోపిక్ తీయగా అది బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.కానీ వైఎస్ బయోపిక్ మాత్రం మంచి ఫలితాన్ని ఇచ్చింది అని చెప్పవచ్చు. ఇక ఈ బయోపిక్ కు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్లకు బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు.
ఇక యాత్ర పార్ట్-1 బాగా సక్సెస్ కావడంతో, యాత్ర -2 కూడా త్వరలో చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది.. కేవలం ఈ వార్తలు అప్పట్లో లో ఎక్కువగా వినిపించాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో జగన్ జీవిత కథ ఆధారంగా.. యాత్ర-2 సినిమాను తీస్తే ప్రేక్షకులు సానుకూలంగా స్పందిస్తారని సందేహం ఉన్నదట. అందుచేతనే ఈ సినిమా తీయక పోవడానికి ముఖ్య కారణం అన్నట్లుగా సినీ ఇండస్ట్రీలో సమాచారం.
ఇక అంతేకాకుండా రాజశేఖర్ రెడ్డి ఇమేజ్.. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ వేరు.పైగా రాజశేఖరరెడ్డి మరణాంతరం ఆయన ఇమేజ్ ఇంకా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రాజశేఖర్ రెడ్డి గురించి చూపించడానికి బాగా ఎమోషనల్ సెంటిమెంట్ లు ఉన్నాయి. కానీ జగన్ లో చూపించడానికి అలాంటి సన్నివేశాలు ఎక్కడా కనిపించకపోవడంతో ఈ సినిమా నిర్మించలేక పోయారట అన్నట్లు ఒక విషయం బయటికి రావడం జరిగింది.ఇక అంతే కాకుండా ప్రస్తుతం జగన్ అనేక విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఇక ఇదే టైంలో జగన్ బయోపిక్ యాత్ర-2 తీస్తే నెగిటివ్ ఎఫెక్ట్ చూపించవచ్చు అని సినీ మేకర్స్ పడ్డారేమో అన్నట్లుగా వినిపిస్తోంది.