వైరల్ వీడియో : ఆర్ఆర్ఆర్ సెట్స్ లో ఎన్టీఆర్..!

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో అందరూ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి ఏ సినిమా చేసినా అది బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం ఖాయం. ఇప్పటి వరకూ ఆయన చేసిన సినిమాలన్నీ ఇండస్ట్రీలో కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా కూడా భారీ అంచనాల మధ్యే షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉక్రెయిన్ లో జరుగుతోంది.

దీనిని ఎలాగైనా దసరాకి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ కష్టపడుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి హీరోల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో రామ్ చరణ్ కూర్చొని ఉంటాడు. ఎన్టిఆర్ వచ్చి డ్రమ్స్ ప్రాక్టీస్ అయ్యిందా అని అడుగుతాడు. అందు రామ్ చరణ్ టేబుల్ పై దరువేసి డ్రమ్స్ ప్రాక్టీస్ అయిపోయిందంటూనే రాజమౌళి కొడుక్కి ఏంటిది డ్రమ్స్ లేవు ఎలా ప్రాక్టీస్ చేయాలని చెబుతాడు. అందుకు రాజమౌళి కొడుకు రెండు నిమిషాల్లో అన్ని వచ్చేస్తాయని చెబుతాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Share post:

Popular