ఎన్టీఆర్ కు రాజకీయాలు కలిసి వోచ్చాయా లేదా..?

టాలీవుడ్ లో నందమూరి తారక రామారావు అంటే ఎంతో మంది అభిమానులను పోగు చేసుకున్న వ్యక్తిగా గుర్తింపు ఉన్నది.ఇక అంతే కాకుండా ఈయన నటన పరంగా రాజకీయ పరంగా బాగా ప్రేక్షకులను ఆదరించిన వ్యక్తిగా పేరు సంపాదించాడు.అయితే ఈయన రాజకీయంగా ఎదగడం వల్ల ఆయనకి కలిసొచ్చింద లేదా అన్న విషయంపై ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన తొమ్మిది మాసాలకే ఆ పార్టీని అధికారంలోకి తీసుకు రావడం కేవలం ఎన్టీఆర్ కే సాధ్యమైందని అని చెప్పవచ్చు.ఇక అంతే కాకుండా ఈయన భాష స్పష్టంగా మాట్లాడటం చేత ఈయనకి విపరీతంగా ప్రేక్షక అభిమానులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆయన రాజకీయంగా ఎలా ఎదిగాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ వి రమణ తెలియజేశారు.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి సక్సెస్ కావడానికి ముఖ్య కారణం ఊరూరా తిరిగి తన మాటలతో ప్రేక్షకులను బాగా ఆకర్షించడం అని తెలియజేశాడు. అంతేకాకుండా ఆయన ఒక గొప్ప నటుడని ప్రేక్షకులు ఆయనకి ఓటు వేయలేదని తెలియజేశాడు. కేవలం ఆయన తన మాటలతో, ఆయన చేపట్టిన బస్సు యాత్ర తోనే ఆయన బాగా పాపులర్ అయ్యాడు అని చెప్పుకొచ్చాడు. అయితే రాజకీయంగా ఆయనకి బాగా కలిసి వచ్చిందని కూడా తెలియజేశాడు.

ఇక ఈయన తర్వాత ఎంతో మంది సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల వైపు అడుగులు వేసిన ఎక్కువగా ఎవరికి కలిసిరాలేదని చెప్పవచ్చు.