అవకాశాల కోసం నిత్యామీనన్ ఇంత దారుణంగా చేస్తుందా?

దక్షిణాదిలో ఉన్న హీరోయిన్ లలో నిత్యా మీనన్ కూడా ఒకరు. చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత అన్నీ మంచి మంచి పాత్రలే చేసింది. గ్లామర్‌ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకున్నారు. ఈ మధ్య ‘గీత గోవిందం’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రాలలో అలరించింది. ఇక తాజాగా మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో నటిస్తోంది.

అయితే ఈమెకు టాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నప్పటికీ హీరోయిన్ గా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి అంటున్నారు. తెలుగులో దర్శక నిర్మాతలు ఆమెకు ఇలాంటి ఆఫర్లు ఎక్కువ ఇస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేయడానికి ఆఫర్ లు రాబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఇక ఈ సినిమా తర్వాత నిత్యా మీనన్ కెరీర్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.

Share post:

Latest