అల్పాహారంలో ఈ తప్పులు చేస్తే బరువు పెరుగుతారట ..!

అల్పాహారం అనేది మన రోజువారీ జీవన వ్యవస్థ పై ఎంతో ప్రభావం చూపుతుంది. కానీ కొంతమంది వారి వారి పనుల కారణంగా ప్రతిరోజు అల్పాహారాన్ని మిస్ చేస్తూ ఉంటారు. అయితే అల్పాహారం తినకపోవడం వల్ల కడుపులో ఉబ్బరం , గ్యాస్ , అజీర్తి , మంట వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఇక మరికొంతమంది మాత్రం ఏ మాత్రం వైద్యుల సలహాలు వినకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు . పైగా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. మరికొంతమంది అల్పాహారం చేసేటప్పుడు పక్కన కాఫీ లేకపోతే వారు అల్పాహారం తినడానికి ఇష్టపడడం లేదు. అల్పాహారం చేస్తూ కాఫీ తాగితే ఏమవుతుంది..? మనం తీసుకునే అల్పాహారంలో ఎటువంటి తప్పులు చేయడం వల్ల బరువు పెరుగుతారు ..? అనే విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

అల్పాహారం చేసేటప్పుడు జ్యూస్ లేదా కాఫీ తాగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా త్వరగా ఆకలి వేస్తుందట. ఇలా ఆకలి వేయడం వల్ల తిండి పైన ధ్యాస పెరిగి , బరువు పెరిగే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసేటప్పుడు కాఫీ కానీ జ్యూస్ గానీ తాగకుండా ఉంటేనే మంచిది.

అంతేకాదు కొంతమంది బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం లో భాగంగానే బ్రెడ్ జామ్ లేదా ఏదైనా తీపి కలిగిన పదార్థాలను తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఉదయాన్నే ఇలా తీపి పదార్థం కలిగిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ అన్ బ్యాలెన్స్డ్ అవడంవల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఉందట.

బ్రేక్ ఫాస్ట్ ను ఎనిమిది గంటల లోపు చేయడానికి ప్రయత్నం చేయాలి . ఆ తరువాత చేసినా కూడా ఫలితం ఉండదు .. ఎందుకంటే ఉదయం లేచిన రెండు గంటలలోపు ఏదైనా తీసుకోవాలని , లేకపోతే ఖాళీ కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి, కడుపులో మంట వచ్చే ప్రమాదం కూడా ఉందట.

ప్రోటీన్స్ అధికంగా ఉండే పదార్థాలను కూడా ఉదయం పూట తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నట్లయితే ఫలితంగా బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది.ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం వల్ల అధిక బరువు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు.