నితిన్ సినిమా ఓటీటీలోనే.. కన్ఫర్మ్ చేసిన టీమ్!

కరోనా మహమ్మారి వల్ల థియేటర్లు పూర్తిగా తెలుసుకోకపోవడం తో ఇప్పటికే ఎన్నో సినిమాలు ఓటిటి బాట పట్టాయి. హీరో నాని ఇటీవలే టక్ జగదీష్ మూవీ ఓటీటీ లో విడుదల అవుతుంది అని ప్రకటించగా హీరో నితిన్ కూడా తాజాగా మాస్ట్రో సినిమా కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల అవుతుంది అన్నట్లు తెలిపాడు. మాస్ట్రో మూవీ ని నేరుగా ఓటిటీ లో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది.

ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను ఆగస్టు 23 వ తేదీ సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్లు నితిన్ తెలిపారు. ఈ సినిమా హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అంధాధున్ సినిమాకు రీమేక్ గా రూపొందింది. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, మహతి సర్వ సాగర్ సంగీతం సమకూర్చాడు. ఈ సినిమాలు నితిన్ అంధుడిగా కనిపిస్తాడు. ఈ సినిమాలో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది.మిల్కీ బ్యూటీ తమన్నా  కీలక పాత్రలో కనిపించనుంది

Share post:

Popular