సూప‌ర్ ప‌వ‌ర్స్‌తో ప్ర‌భాస్ మ్యాజిక్..అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే?

సూప‌ర్ ప‌వ‌ర్స్‌తో ప్ర‌భాస్ మ్యాజిక్ చేయ‌బోతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌భాస్, నాగ్ అశ్విన్ కాంబోలో ఓ భారీ బ‌డ్జెట్ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ప్రాజెక్ట్ కె వ‌ర్కింగ్ టైటిల్‌తో ఇటీవ‌లె ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. ఈ చిత్రంలో దీపికా ప‌దుకోనె, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా టైమ్ ట్రావ‌ల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోతున్నార‌ని ఎప్ప‌టి నుంచో వార్తలు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మ‌రో న్యూస్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. సూపర్‌ హీరో కాన్సెప్ట్‌ తో ఈ సినిమా ఉంటుంద‌ట‌.

సూపర్‌ హీరో లా ప్రభాస్ కు పవర్స్ వస్తాయని.. ఆ ప‌వ‌ర్స్‌తోనే టైమ్ ట్రావ‌ల్ చేస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది. కాగా, ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది.