హిందువులు తాలిబన్లు…? హీరోయిన్ పై దాడి..?

బాలీవుడ్ హీరోయిన్ స్వ‌రా భాస్క‌ర్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సినిమాల కంటే వివాదాల‌తోనే ఫుల్ పాపుల‌ర్ అయిన స్వ‌రా భాస్క‌ర్‌.. తాజాగా నోటి దురుసుతో మ‌రోసారి అడ్డంగా బుక్కైంది. అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచాకాలపై స్వరా భాస్కర్ త‌న అభిప్రాయాన్ని తెలియ‌జేస్తూ ఓ ట్వీట్ చేసింది.

`హిందూత్వ ఉగ్రవాదాన్ని మేం అంగీకరించలేము.. అలానే తాలిబన్‌ల ఉగ్రవాదాన్ని చూసి అందరూ షాక్‌ అవుతున్నారు. అయితే అలా షాక్‌లోనే ఉండిపోకండి.. హిందూత్వ ఉగ్రవాదం గురించి అందరూ ఆగ్రహం వ్యక్తం చేయండి. మన మానవతా, నైతిక విలువలు అణచివేత, అణచివేతకు గురైన వారి గుర్తింపుపై ఆధారపడి ఉండకూడదు` అంటూ స్వ‌రా భాస్క‌ర్ ట్వీట్ చేసింది.

దాంతో ఆమె ట్వీట్‌పై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తాను ఫేమ‌స్ అవ్వ‌డం కోసం హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ తీసింద‌ని.. వెంట‌నే స్వ‌రాను అరెస్ట్ చేయాల‌ని నెటిజ‌న్లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మ‌రి కొంద‌రు స్వరాను ఆరు నెలల పాటు అఫ్గనిస్తాన్‌ పంపించాలి. అక్కడ ఆమె తాలిబన్ల ఉగ్రవాదాన్ని రుచి చూస్తుంద‌ని మండిప‌డుతున్నారు. ఇక ఇప్ప‌టికే బ‌ర్ఖా తెర్హాన్ సంఘం స్వ‌రాపై మొత్తం 12 జిల్లాల్లో కేసులతో దాడి చేస్తున్నారు.

Image

Share post:

Latest