మెగా కుమార్తె నిర్మాణంలో ‘శ్రీదేవి శోభన్‌బాబు’..!

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన నటించే చిత్రాల అప్‌డేట్స్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. అవి చూసి మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే మెగాస్టార్ కు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్తున్నారు. ఈ క్రమంలోనే చిరు పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి పెద్ద కూతురు సుస్మితా కొణిదెల, అల్లుడు విష్ణుప్రసాద్‌ కలిసి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. తమ నిర్మాణంలో రాబోతున్న ఫస్ట్ ఫిల్మ్ ఇదే అంటూ ‘శ్రీదేవి శోభన్‌బాబు’ అనే సినిమాని అనౌన్స్ చేశారు.

ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా సంతోష్‌ శోభన్‌, గౌరి జి. కిషన్‌ నటిస్తున్నారు. ఈ ఫిల్మ్ ఫస్ట్‌ లుక్‌‌ను రిలీజ్ చేశారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలో తెలుపనున్నట్లు సుస్మిత పేర్కొంది.
మెగా డాటర్ సుస్మిత చిరంజీవికి ‘సైరా’ చిత్రంలో కాస్టూమ్స్ ఎక్సలెంట్‌గా డిజైన్ చేసిన సంగతి అందరికీ విదితమే. సుష్మిత ఇప్పటికే ప్రొడ్యూసర్‌గా ఎంట్రీ ఇచ్చేశారు. ‘షూట్ అవుట్ ఎట్ ఆలేరు’ అనే వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసింది. కాగా ‘శ్రీదేవి శోభన్‌బాబు’ మూవీ ఇంట్రెస్టింగ్ స్టోరీతో రాబోతున్నట్లు మేకర్స్ చెప్తున్నారు.

Share post:

Popular