స్పేస్‌లో దూసుకెళ్లిన‌ మ‌హేష్‌..మ్యాట‌రేంటంటే?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు నిన్న 46వ బ‌ర్త్‌డే సెల‌బ్రేట్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే నిన్నంతా మ‌హేష్‌ సోషల్ మీడియాను హైజాక్ చేసిపడేశారు. నెట్టింట ఎక్క‌డ చూసినా ఆయ‌నే ద‌ర్శ‌న‌మిచ్చారు. ఇక స్పేస్‌లోనూ దూసుకెళ్లాడు మ‌హేష్‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఈ మ‌ధ్య ట్విట్ట‌ర్ తీసుకొచ్చిన కొత్త ఫీచరే స్పేస్‌. ఇందులో ఒక టాపిక్ ఎంచుకుని ఎంత‌మందైనా జాయిన్ అయి చ‌ర్చ పెట్టుకోవ‌చ్చు.

అయితే నిన్న మ‌హేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా..టాలీవుడ్ సినీ ప్రముఖులు కలిసి ట్విట్టర్ లో స్పేస్ సెషన్ ను ఏర్పాటు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడటంతో స్టార్ అయిన ఈ స్పేస్ సెషన్‌లో.. అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, పరశురామ్, శ్రీనువైట్ల, సందీప్ రెడ్డి వంగా, గోపీచంద్ మలినేని, బాబీ, మెహర్ రమేష్, అల్లరి నరేష్, అడవి శేష్, సుధీర్ బాబు త‌దిత‌రులు మ‌హేష్‌తో వారికున్న అనుబంధం గురించి మాట్లాడారు. అనేక విష‌యాలు పంచుకున్నారు.

అయితే ఈ స్పేస్ సెష‌న్ మ‌ధ్య‌లో మ‌హేష్ బాబు సైతం జాయిన్ అయ్యారు. ట్విట్టర్ స్పేస్ ద్వారా తనకు విషెస్ అందించిన ప్రతి ఒక్కరికీ మహేష్ బాబు ధన్యవాదాలు తెలిపారు. దాంతో టాలీవుడ్ అనే కాదు.. సౌత్ ఇండియాలో ఇలా ట్విట్ట‌ర్ స్పేస్‌లో పాల్గొన్న ఏకైక బిగ్ స్టార్‌గా మ‌హేష్ నిలిచారు.

Share post:

Popular