ధ‌నుష్‌పై మండిప‌డ్డ హైకోర్ట్‌..కోట్లు సంపాదించే మీరు ఆ ప‌ని చేయ‌రా?

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్‌పై మద్రాస్ హైకోర్టు మండిప‌డింది. ఇప్పుడు ఈ విష‌యం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..ఈ యేడాది ఖరీదైన రోల్స్ రాయిస్ కారును ధనుష్‌ విదేశాలను నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ కారు దిగుమతి చేసుకున్నందుకు ఇక్కడి అధికారులకు పన్ను చెల్లించాల్సి ఉంది.

అయితే ధనుష్ టాక్స్ మినహాయింపు ఇవ్వమని కోర్ట్ ని ఆశ్రయించాడు. ఈ విషయంపై మద్రాస్ హైకోర్టు స్పందిస్తూ.. ధునుష్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సామాన్యులు ఒక సోపు కొన్నా ప్రభుత్వానికి టాక్స్ కడుతున్నాడు.. కానీ, కోట్లు సంపాదించే మీరు టాక్స్ క‌ట్ట‌లేరా అని ప్రశ్నించింది.

అలాగే ఎంత ఖరీదైన కారు కొన్నా రోడ్డుమీదనేగా నడిపేది, ఆకాశం లో కాదు అంటూ వ్యాఖ్యానించిన‌ కోర్టు.. ఏది ఏమైనా మీరు ప‌న్ను క‌ట్టాల్సిందే అని తేల్చి చెప్పింది. కాగా, ఈ మ‌ధ్య విజ‌య్ ద‌ళ‌ప‌తి కూడా కొత్త కారు కొనుగోలు.. టాక్స్ మినహాయింపు ఇవ్వమని కోర్టు మెట్లు ఎక్క‌గా.. ధ‌ర్మ‌స్థానం చివాట్లు పెట్టిన సంగ‌తి తెలిసిందే.