కృతి సనన్ పెళ్లి పీటలు ఎక్కబోతోందా..?

బాలీవుడ్ బ్యూటీ కొద్ది సంవత్సరాల నుండి , టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు చూడలేదు .ఎందుకంటే ఆమెకు తక్కువ ఛాన్స్ లు వచ్చాయి. మహేష్ బాబుతో 1 నేనొక్కడినే, దోచెయ్ సినిమాలలో నటించింది. కానీ ఆ సినిమా పెద్దగా ప్రేక్షకులను అలరించ లేకపోయింది.ఈ రెండు చిత్రాలు ఆమెకు పెద్ద సక్సెస్ ని సాధించి పెట్టలేక పోయాయి. ఆ తర్వాత ఈ అమ్మడికి పెద్దగా ఆఫర్స్ ఏమీ రాలేదు.

ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ పెళ్లి కూతురు గెటప్ లో కనిపించింది. ప్రస్తుతం ప్రభాస్ కు జోడి గా నటించబోతోంది. ఆది పురుష్ మూవీలో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ అమ్మడు సరదాగా పెళ్లి కూతురు గెటప్ లో ఫోటోలను షేర్ చేయగా , కొంతమంది నెటిజన్లు కృతి సనన్ పెళ్లి కళ వచ్చేసిందే అంటూ కామెంట్స్ ని పెడుతున్నారు. మరికొందరు పెళ్లి గురించి శుభవార్త చెబుతుందని అనుకుంటున్నారు. ఏదైతేనేం ఈ ముద్దుగుమ్మ పెళ్లి డ్రెస్ లో చాలా అందంగా కనిపిస్తోంది.ఇక ఈమె బాలీవుడ్ మిమి సినిమా కోసం కృతి సనన్ 15 కేజీ ల బరువు పెరిగిందట. కానీ బరువు తగ్గటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఆది పురుష్ మూవీతో ఈ ముద్దుగుమ్మ సక్సెస్ ను సాధిస్తుందో ఏమో చూడాలి.https://instagram.fvtz3-1.fna.fbcdn.net/v/t50.2886-16/10000000_235020948505997_6112410439032422573_n.mp4?_nc_ht=instagram.fvtz3-1.fna.fbcdn.net&_nc_cat=105&_nc_ohc=YMKV2DFAHR0AX8hZ_fM&tn=3EtlAApDO2awHw1P&edm=ADECaisBAAAA&ccb=7-4&oe=61298E35&oh=7615d974e62437b2091dbbcec3945667&_nc_sid=ca78b6